IN ANY OTHER COUNTRY SUCH A MINISTER WOULD HAVE BEEN DISMISSED – ఇలాంటి మంత్రిని ఇంకే దేశంలోనైనా పదవి నుండి తీసిపారేసేవారు

 సంపాదకులకు, 

‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక.

అయ్యా,

బాంబే హోమ్ మినిస్టర్ (హోం మంత్రి) హైకోర్టు ఇద్దరు జూదగాళ్లకు విధించిన శిక్షలను సస్పెండ్ చేసిన చర్యను అనుసరించి, వెంటనే సెంట్రల్ ప్రావిన్సెస్ (C.P.) హోమ్ మినిస్టర్ తీసుకున్న మరో చర్య గురించి వార్త వచ్చింది. సి.పి. హోమ్ మినిస్టర్, 14 ఏళ్ల బాలికపై లైంగిక దాడి (రేప్) ఆరోపణ కింద మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడిన జాఫర్ హసన్ అనే వ్యక్తి యొక్క శిక్షను, జ్యుడిషియల్ కమిషనర్ల కోర్టు తీర్పును తోసిరాజని, తగ్గించారు.

ఈ కేసులో శిక్ష 1936లో జరిగింది. నిందితుడు కేవలం ఒక సంవత్సరమే జైలులో ఉన్నాడు, అంటే అతనికి రెండు సంవత్సరాల శిక్ష తగ్గించబడింది (రిమిషన్ ఇచ్చారు).

నా ఉద్దేశం ఏంటంటే, సీ.పీ. లోని కాంగ్రెస్ మంత్రి చేసిన ఈ పని చాలా సిగ్గులేని చర్య. దీనికి సాటి అయిన విషయం మరొకటి దొరకదు. కాంగ్రెస్ పార్టీకి గుడ్డిగా మద్దతిస్తున్న హిందూ ప్రజలు ఈ చర్యల గురించి ఏమనుకుంటున్నారు?

ఈ విషయం కనుక అగ్ర కులాల హిందువులకు సంబంధించింది అయితే, నేను మిమ్మల్ని ఈ ఉత్తరంతో ఇబ్బంది పెట్టేవాడిని కాదు. ఆ బాలిక అగ్ర కులాల హిందూ అమ్మాయి అయితే ఇది పెద్ద సమస్య కాదని కాదు, కానీ, కాంగ్రెస్ తప్ప వేరే పార్టీ, మహాత్ముడు తప్ప వేరే మనిషి తమకు విముక్తిని (సాల్వేషన్) ఇవ్వలేరనే మత విశ్వాసాన్ని హిందువులు పెంచుకున్నారు కాబట్టి. వాళ్ళు తమ భవిష్యత్తును ఒకే పార్టీ చేతుల్లో పెట్టేసి, నమ్మినవాళ్ల చర్యలను పరిశీలించడానికి నిరాకరించారు. వాళ్లకు కష్టం వస్తే, అది వాళ్ల తప్పు.

కానీ ఈ బాలిక అణగారిన వర్గానికి (Depressed Classes) చెందినది. ఆమె కులం చాంబర్. అందుకే నేను చాలా ఆందోళన చెందుతున్నాను.

మేము అల్పసంఖ్యాక వర్గంగా ఉండాల్సిందే (We are destined to be in a minority). మేము కేవలం విమర్శించగలం. మేము ఎప్పుడూ పాలించగలం లేదా నియంత్రించగలం అని ఆశించలేము.

సెంట్రల్ ప్రావిన్సెస్ (C.P.) హోమ్ మినిస్టర్ లాంటి చర్యలను హిందూ ప్రజలు సహించుకుంటే, ప్రధాని (Prime Minister) సమర్ధిస్తే, మరియు మహాత్ముడు చూసీ చూడనట్లు వదిలేస్తే, అణగారిన వర్గాలకు (Depressed Classes) న్యాయం, ధర్మం జరుగుతుందని ఇంకెంత ఆశ ఉంటుంది?

మరే ఇతర దేశంలోనైనా, ఇలాంటి మంత్రిని పదవి నుండి తప్పించేవారు అని నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ, భారతదేశంలో ఇలా జరగడం మనం ఊహించాల్సిందేనా?

ఈ సిగ్గుమాలిన చర్యను (Reprehensible act) తమ మంత్రి తరపున తాను, మరియు తమ ప్రధాన మంత్రి ఎలా సమర్థించుకుంటారో అని మహాత్మా గాంధీ అణగారిన వర్గాలకు (Depressed Classes) ఒక వివరణ చెప్పి తీరాలి.

బి.ఆర్. అంబేద్కర్. బాంబే

Share your love
eliababu sarella
eliababu sarella
Articles: 26

Leave a Reply